TTD Declaration: ఆనాడే డిక్లరేషన్ ఇచ్చిన జగన్
TTD Declaration: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు రావాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్టిమేటం విధించారు. ఇది తన పర్సనల్ అభిప్రాయం కాదని… అన్య మతస్థులు తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్‌పై ఇవ్వాల్సిందేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో 1990ల నుంచే రూల్ ఉందని అంటున్నారు. దాంతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతేకాదు.. తన మతానికి సంబంధించిన డిక్లరేషన్ అడుగుతున్నారని.. తన మతం మానవత్వం అని రాసుకోవాలని జగన్ సమాధానమిచ్చారు.
ఆనాడే జగన్ డిక్లరేషన్
అయితే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అంశం ఏంటంటే.. ఆల్రెడీ ఓసారి జగన్ తన డిక్లరేషన్‌ను ఇచ్చారట. 2009, 2012, 2020ల్లో జగన్ తిరుమలకు వెళ్లారు. 2012లో జగన్ తిరుమల వెళ్లినప్పుడు కూడా ఇదే డిక్లరేషన్ సమస్య డిబేట్‌కి వచ్చింది. ఆనాడు జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఆల్రెడీ 2009లో ఇచ్చానని.. ఒక్కసారి ఇస్తే అదే పర్మనెంట్‌గా ఉంటుంది కానీ మాటిమాటికీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. 2020లో డిక్లరేషన్‌పై సంతకం చేయనందుకు ఏపీ హైకోర్టులో పిటిషన్ నమోదైంది. దీనిపై అప్పటి న్యాయమూర్తి విచారణ జరిపి.. ఒక ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్తే తప్పేంటని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
గతంలో ఏపీజే అబ్దుల్ కలాం, సోనియా గాంధీలు కూడా డిక్లరేషన్ సమర్పించారట. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నిస్సార్ అహ్మద్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వనన్నారు. దాంతో ఆయన తిరుమలకు రాను అని శపథం చేసారు.