Jagan: షర్మిళను కాంగ్రెస్‌లోకి వద్దన్నారా?
వైఎస్ షర్మిళ.. (ys sharmila) తన YSR తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో (congress) విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తుది చర్చలు జరుగుతున్నాయి. అయితే షర్మిళ కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఏపీ సీఎం జగన్‌కు (jagan) ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఏపీలో జగన్‌కు తీవ్ర ప్రతికూలత ఏర్పడుతున్న నేపథ్యంలో షర్మిళ కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఏపీపై ఫోకస్ చేస్తే మళ్లీ తాను అధికారంలోకి రానేమో అని జగన్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జగన్ తన తల్లి విజయమ్మను (ys vijayamma) ఫోన్ చేసారని.. షర్మిళను కాంగ్రెస్‌లోకి వెళ్లద్దని నచ్చజెప్పాలని కోరారట. కావాలంటే.. ఆస్తిని షర్మిళకు సమానంగా పంచేస్తానని కూడా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నిన్న రాత్రి షర్మిళ తన భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లారు. అదే సమయంలో విజయమ్మ వెంటనే షర్మిళకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రావాలని చెప్పారట. దాంతో వివాహ వేడుక మధ్యలోనే షర్మిళ, అనిల్ విజయమ్మ ఇంటికి చేరుకున్నారట. అప్పుడు విజయమ్మ జగన్ చెప్పినదంతా షర్మిళకు వివరించినట్లు సమాచారం. మరి షర్మిళ ఏం నిర్ణయించుకున్నారో చూడాలి. (jagan)