BJP రిగ్గింగ్ చేసిందా.. స్థానిక నేత‌లకు 50 ఓట్లు మాత్ర‌మే ఎలా ప‌డ్డాయి?

Madhya Pradesh Elections: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ్గా జాతీయ పార్టీ అయిన BJP మూడు రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలుపు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ (congress) తెలంగాణ‌తో స‌రిపెట్టుకుంది. అయితే రాజ‌స్థాన్, ఛ‌త్తీస్‌గ‌డ్ ఎన్నిక‌ల సంగ‌తి అటుంచితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాత్రం BJP రిగ్గింగ్‌కి పాల్ప‌డింద‌ని కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్ (kamal nath) ఆరోపిస్తున్నారు.

ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఎప్ప‌టినుంచో స్థానికంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు ఈసారి మ‌రీ 50 ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయ‌ట‌. అదెలా సాధ్యం అని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంత చెడ్డ నేత‌కైనా క‌నీసం 1000 ఓట్ల వ‌ర‌కు అయినా ప‌డ‌తాయి కానీ ఇలా 50 ఓట్లు మాత్రమే ఎలా వేస్తారని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. EVMల చిప్‌ల‌ను BJP హ్యాక్ చేసింది కాబ‌ట్టే మెజారిటీ ఓట్లు ద‌క్కించుకుంద‌ని కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ కూడా ఆరోపిస్తున్నారు. 230 సీట్లు ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో BJPకి 163 సీట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ 66 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది.

రాజస్థాన్ నేత‌ల ఫోన్ ట్యాపింగ్

మ‌రోప‌క్క రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో కూడా భారీ విజ‌యం ద‌క్కించుకున్న BJP.. స్థానిక కాంగ్రెస్ నేత‌లైన స‌చిన్ పైల‌ట్, అశోక్ గెహ్లోత్‌ల ఫోన్లను ట్యాప్ చేసార‌ని.. వారు ఎక్క‌డికి వెళ్తున్నారు ఎవ‌రితో మాట్లాడుతున్నారు అనే అంశాల‌ను మానిట‌ర్ చేసార‌ని గెహ్లోత్ ఆఫీస్‌లో ఆన్ స్పెష‌ల్ డ్యూటీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్న లోకేష్ శ‌ర్మ షాకింగ్ విష‌యాల‌ను బయ‌ట‌పెట్టారు. దీనిపై CLP మీటింగ్‌లో పైల‌ట్, గోహ్లోత్ చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.