EXCLUSIVE: “Jr NTR ఫ్లెక్సీలున్నాయ్.. వెంట‌నే వెళ్లి పీకేయండి”

EXCLUSIVE: నంద‌మూరి బాల‌కృష్ణ‌ (nandamuri balakrishna), నారా చంద్ర‌బాబు నాయుడు (nara chandrababu naidu) క‌లిసి ఈరోజు గుడివాడ వెళ్లారు. దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు వర్ధంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘ‌ట్ వ‌ద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లారు. అయితే బాల‌కృష్ణ కారులో ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు వెళ్తున్న‌ప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) ఫ్లెక్సీలు క‌నిపించాయి. దాంతో వెంట‌నే త‌న స‌హాయ‌కుల‌ను పిలిపించి.. ఆ ఫ్లెక్సీల‌ను వెంట‌నే పీకించేయండి అని చెప్పార‌ట‌. మేం తీసేస్తాం స‌ర్.. మీరు వెళ్లండి అని స‌హాయ‌కులు చెప్పేవ‌ర‌కు కూడా బాల‌య్య వ‌దల్లేద‌ని టాక్. తారక్ అంటే బాల‌య్య‌కు ఎందుకు అంత కోపం అని అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇటు సినీ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే జరుగుతోంది.