AP Elections: అధికారం కూటమిదే అని పోలీసులు ముందే పసిగట్టారా?
AP Elections: నిన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. దాదాపు 80 శాతం మంది ఏపీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సమాచారం. నిన్న పోలింగ్ సమయంలో జరిగిన గొడవలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబులు ఈరోజు ప్రెస్మీట్లు పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేసారు. తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తున్న ప్రదేశాల్లో అసలు పోలీసులు లేరని.. వైఎస్సార్ కాంగ్రెస్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం ఒక బెటాలియన్ను దించారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గొడవలు జరుగుతున్నాయి.. ప్రజల తలలు పగలగొడుతున్నారు అని సమాచారం ఇచ్చేందుకు పోలీసులకు ఫోన్లు చేస్తే కనీసం ఎత్తలేదని ఆయన అన్నారు.
మరోపక్క అంబటి రాంబాబు తనపై దాడికి చేసేందుకు కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నించాడని.. అతని కార్యకర్తల తనను అడ్డుకోవడంతో షాకయ్యానని తెలిపారు. పోలీసులకు ఫోన్ చేసి భద్రత కల్పించమని కోరదామంటే ఎవ్వరూ కూడా లిఫ్ట్ చేయలేదని.. ముఖ్యంగా రాంబాబు అనే ఎస్పీ తెలుగు దేశం పార్టీ చెప్పినట్లే నడుచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అసలు భద్రత లేదని వాపోయారు.
దీనిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి తర్వాత అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమే అని మళ్లీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అని అర్థమైపోయిందనే టాక్ వినిపిస్తోంది. పోలింగ్ సమయంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ముందుగా పోలీసు యంత్రాంగానికే తెలుస్తుంది. అందుకే వారు ఏ పార్టీ గెలవబోతోందో తెలుసుకుని ఆ పార్టీ తరఫున పనిచేస్తుంటారట. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ప్రెస్మీట్లను బట్టి చూస్తే.. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని.. అందుకే పోలీసులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఫోన్లు లిఫ్ట్ చేయలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.