Dhiraj Sahu: రూ.350 కోట్ల డ‌బ్బు.. త‌న‌ది కాదు అంటున్న కాంగ్రెస్ ఎంపీ

Dhiraj Sahu: భార‌త‌దేశంలోనే అతిపెద్ద న‌ల్ల డ‌బ్బు కేసు ఇటీవ‌ల బ‌య‌టికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ అయిన ధీర‌జ్ సాహు ప్ర‌సాద్ ఇంట్లో దాదాపు 10 బీరువాల్లో నోట్ల క‌ట్ట‌లు క‌నిపించ‌డంతో ఐటీ అధికారుల‌కే దిమ్మ తిరిగింది. ఆయ‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బు కట్ట‌ల‌ను లెక్క‌పెట్టేందుకు ఐదు రోజులు ప‌ట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు తేలిన లెక్క రూ.350 కోట్లు. దీనిపై ధీర‌జ్ సాహు స్పందిస్తూ.. ఈ డ‌బ్బుకు కాంగ్రెస్ పార్టీకి కానీ మరే ఇత‌ర పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేద‌ని.. త‌న తండ్రి లిక్క‌ర్ బిజినెస్ మొద‌లుపెట్టి వందేళ్లు అవుతోంద‌ని.. లిక్క‌ర్ వ్యాపారంలో అంద‌రూ కూడా క్యాష్ ఇచ్చే కొనుగోలు చేస్తుంటార‌ని వివ‌రించారు. ఈ డ‌బ్బు అంతా త‌న సోద‌రుడిద‌ని ఇందుకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్ల‌ను ఐటీకి స‌బ్మిట్ చేస్తామ‌ని తెలిపారు.