delhi liquor scam: సీబీఐ, ఈడీ ఎందుకంత సీరియస్?
Delhi – లిక్కర్ స్కాంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (elhi chief minister Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయన కేవలం సాక్షిగా మాత్రమే విచారిస్తున్నట్లు ఇప్పటికే సీబీఐ అధికారులు వెల్లడించారు. నూతన మద్యం విధానం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి దాదాపు రూ.2,600 కోట్లు నష్టం జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చే విధంగా పాలసీని రూపొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు లిక్కర్ స్కాంలో ఏం జరిగింది? ఈడీ, సీబీఐ విచారణ చేపట్టడానికి కారణాలు తెలుసుకుందాం.
ఢిల్లీలో గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నడిపేవారు. ఈక్రమంలో మద్యం దుకాణాలను ప్రైవేటు వారికి అప్పగించాలని ఆప్ సర్కార్ భావించింది. 2021-22 ఏడాదిలో.. నూతన మద్యం విధానాన్ని రూపొందించింది. మొత్తం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈక్రమంలో ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ రాయితీ ఇచ్చిందనే ఆరోపణలు వినిపించాయి. ఈ పాలసీ రూపొందించిన వారిలో ఆప్ నేత మనీశ్ సిసోడియా కీలకపాత్ర పోషించారు. ఆయనకు తెలిసిన వారికి టెండర్ కట్టబెట్టారని. దీని వల్ల ప్రభుత్వానికి నష్టంతోపాటు, మద్యం పాలసీ విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Lieutenant Governor, Vinay Kumar Saxena) ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన సిఫారసు చేశారు. ఆ తర్వాత సీబీఐ (CBI), ఈడీ (Enforcement Directorate) దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిసోడియాను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు 11 మంది అరెస్టయి తిహార్ జైలులో ఉన్నారు. ఈక్రమంలో కేజ్రీవాల్‌ని సీబీఐ విచారిస్తోంది. ఆయన్ని ప్రధానంగా మద్యం విధాన రూపకల్పన ప్రక్రియకు సంబంధించిన ఓ ముఖ్యమైన ఫైలు కనిపించకుండా పోయింది. దీని గురించి కేజ్రీవాల్‌ను సూటిగా ప్రశ్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.