Kavitha: ఇంకోసారి అలా చేయకండి.. కవితకు జడ్జి వార్నింగ్
Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌజ్ కోర్టు న్యాయమూర్తి వార్నింగ్ ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచేస సమయంలో ఆమె మీడియాతో కేసు గురించి మాట్లాడుతున్నారని.. సీబీఐ, ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారో బయటపెట్టేస్తున్నారని న్యాయమూర్తి మండిపడ్డారు. గతంలో అలా మాట్లాడకూడదు అని వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈరోజు కవిత మళ్లీ మీడియాతో మాట్లాడటంతో న్యాయమూర్తి మండిపడ్డారు. ఇంకోసారి అలా చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
చచ్చినా అప్రూవర్‌గా మారను
తనను భారతీయ జనతా పార్టీ (BJP) ఎంత ఒత్తిడికి గురిచేసినా తాను మాత్రం అప్రూవర్‌గా మారే ప్రసక్తే లేదని.. చివరి వరకు పోరాడతానని కవిత అన్నారు. సీబీఐ, ఈడీ అధికారులు భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న వాటిపైనే ప్రశ్నిస్తున్నారని.. ఇది జ్యుడిషియల్ కస్టడీ కాకుండా భారతీయ జనతా పార్టీ కస్టడీగా ఉందని అన్నారు. కాగా.. ఈరోజు సీబీఐ కోర్టులో కవితను హాజరుపరచగా ఈ నెల 23 వరకు కస్టడీని విధించారు.