Dastagiri: హంత‌కులెవ‌రో త్వ‌ర‌లో బ‌య‌ట‌ప‌డుతుంది

Dastagiri: జై భీమ్ రావ్ నేత.. వివేకానంద రెడ్డి కేసులో అప్రూవ‌ర్‌గా మారిన డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈరోజు ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి హంతకులు బ‌య‌టే తిరుగుతున్నారు అని మాట్లాడుతున్నార‌ని.. ఎవ‌రు హ‌త్య చేసారో ఎవ‌రు చెప్తే హ‌త్య చేసారో యావత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అన్నారు. త్వ‌ర‌లో హంత‌కులు ఎవ‌రో బ‌య‌ట‌ప‌డే స‌మ‌యం వ‌చ్చింద‌ని తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి.. త‌న‌కు వైఎస్ సునీతారెడ్డికి ఒప్పందం కుదిరింద‌ని మాట్లాడుతున్నార‌ని.. అది ఏ ఒప్పందమో బ‌య‌ట‌పెడితే అన్నీ వ‌దిలేసి జైలుకు పోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు.

ALSO READ:

Viveka Murder Case: అవినాష్‌కు స‌పోర్ట్ చేస్తున్న ద‌స్త‌గిరి?

అందుకే వివేకా గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని చెప్పాం