కాంగ్రెస్‌లోకి BRS విలీనం .. ఆ నేత సంచ‌ల‌న కామెంట్స్

danam nagender says brs will merge into congress

BRS: భారత రాష్ట్ర స‌మితి.. అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందా? ఈ మాట ఎవ‌రో కాదు. భార‌త రాష్ట్ర స‌మితి నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన దానం నాగేంద‌ర్ రెడ్డి చేసారు. ఇప్ప‌టికే ఆరుగురు ఎమ్మెల్యేలు ప‌లువురు ఎంపీలు ఆరుగురు ఎమ్మెల్సీలు BRSను వీడి కాంగ్రెస్‌లో చేరారు. రానున్న రోజుల్లో మిగ‌తా నేత‌లు కూడా కాంగ్రెస్‌లోనే చేర‌నున్నార‌ని.. పార్టీ ఖాళీ అవ్వ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌తో విలీనం కావాల‌ని పార్టీ అధినేత KCR యోచిస్తున్నార‌ని దానం సంచ‌ల‌న కామెంట్స్ చేసారు.