Danam Nagender: కంగన భోగం వేషాలు వేస్తది
Danam Nagender: బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ నేత దానం నాగేందర్.
కంగనా రనౌత్ సినిమాల్లో భోగం (వేశ్య) పాత్రల్లో నటిస్తుందని.. అలాంటి మనిషి తమ అధినేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడేంత సీన్ ఉందా అంటూ రెచ్చిపోయారు. రాహుల్ కుటుంబంతా దేశానికి త్యాగం చేసిన వారే ఉన్నారని.. ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ.. ఆ తర్వాత సోనియా, రాహుల్ గాంధీలు దేశం కోసం ఎంతో సేవ చేస్తున్నారని అలాంటివారి గురించి కంగనకు మాట్లాడే నైతిక విలువ లేదని అన్నారు. మొన్నటివరకు భారత రాష్ట్ర సమితిలో ఉన్న దానం.. కాంగ్రెస్‌కు జంప్ అయ్యారు. సిక్రింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ నేత కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.