అనుచరులకు రాని టికెట్లు.. రాజీనామా చేస్తానని వార్నింగ్
Telangana Elections: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో దామోదర రాజనర్సింహ (damodar raja narsimha) ఉన్నారు. తన అనుచరులైన శ్రీనివాస్ గౌడ్, సంజీవ్ రెడ్డికి టికెట్లు కేటాయించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న దామోదర రాజనర్సింహ.. పార్టీకి రాజీనామా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయనకు మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేసి తొందరపడొద్దని రిక్వెస్ట్ చేసారు.