Yogi Adityanath: వారికి హారతులు ఇవ్వాలా ఏంటి?
Uttar Pradesh: క్రిమినల్స్ ఇళ్లను కూల్చేయకుండా హారతులు ఇవ్వమంటారా అంటూ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) సెటైర్ వేసారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవారిని, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేవారి పట్ల తన ప్రభుత్వం ఇలాంటి చర్యలే తీసుకుంటుందని అన్నారు.
“” ఉత్తర్‌ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఇంకా పాత కాలం నాటి నాగలితో పనిచేస్తే ఎలా? బుల్ డోజర్లు వాడాలి కదా. గతంలో భూ కబ్జాలకు పాల్పడే మాఫియా దొంగలు ఇళ్లను ఎక్కడికక్కడ కూల్చేసేవారు. ముందున్న ప్రభుత్వాలు మాఫియాను అడ్డుకోవడానికి భయపడ్డాయి. ఇక్కడ మీడియా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేను కేవలం క్రిమినల్స్‌నే టార్గెట్ చేస్తున్నాను. అంతేకానీ ముస్లింలను కాదు. నాకు అన్యాయం జరిగింది అని ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఒక్క ముస్లిం కుటుంబాన్నైనా వచ్చి చెప్పమనండి. అన్యాయాలు జరిగితే కోర్టులు ఉండనే ఉన్నాయి. ఎవరి మతం వారిది. మీ మతాన్ని మీరు ఇంట్లో గౌరవించుకోండి. అంతేకానీ రోడ్లపైకి వచ్చి మతం పేరుతో రచ్చ చేస్తాను అంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఈ దేశంలో ఉండాలనుకుంటే ముందు దేశాన్ని గౌరవించాలి. మతాన్ని, కులాన్ని కాదు. క్రిమినల్స్ ఇళ్లు బుల్ డోజర్‌లతో ధ్వంసం చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్లు క్రిమినల్స్ అని మీరే అంటున్నారు కదా. అలాంటివారి ఇళ్లను కూల్చేయకుండా వారికి హారతులు ఇవ్వమంటారా ఏంటి? “” అని సమాధానమిచ్చారు యోగి.