CPI Narayana: ఈ పార్టీలు క‌లిస్తే KCRకు డిపాజిట్లు కూడా రావు

కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిస్తే KCRకు డిపాజిట్లు కూడా రావని అంటున్నారు సీపీఐ నారాయ‌ణ‌ (cpi narayana). కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు కొట్లాటలుంటాయి.. బయట కూడా కొట్టుకుంటారు కానీ అదొక జాతీయ పార్టీ అని కాంగ్రెస్‌తో పాటు వామ‌ప‌క్షాలు క‌లిస్తే కచ్చితంగా KCRకు డిపాజిట్లు రావ‌ని తెలిపారు. కావాలంటే రాసిస్తాన‌ని అంటున్నారు. మ‌రి కూట‌మిలా ఏర్ప‌డ‌టానికి కాంగ్రెస్‌కు (congress) ఇష్ట‌ముందో లేదో త‌న‌కు తెలీద‌ని అన్నారు. (telangana elections)