Telangana Results: కాంగ్రెస్‌కి 4.. AIMIMకి 1.. బోణీ కొట్ట‌ని BRS, BJP

Telangana Results: తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ ఇప్ప‌టికే నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించింది. మ‌రోప‌క్క చార్మినార్ AIMIM అభ్య‌ర్ధి జుల్ఫిక‌ర్ అలీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఉద‌యం చార్మినార్‌లో BJP అభ్య‌ర్ధి మేఘా అగ‌ర్వాల్ ముందంజలో ఉన్న‌ప్ప‌టికీ చివ‌రికి విజ‌యం జుల్ఫిక‌ర్ అలీనే వ‌రించింది. ఇక BJP, BRS పార్టీలు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క విజ‌యాన్ని కూడా ద‌క్కించుకోలేదు. ప్ర‌స్తుతానికి BRS 42 సీట్ల‌లో, BJP 9 సీట్ల‌లో ముందంజ‌లో ఉన్నాయి.

కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్య‌ర్ధులు

కోరం క‌న‌క‌య్య – ఇల్లందు

ఆదినారాయ‌ణ రావు – అశ్వారావు పేట‌

మ‌క్క‌న్‌సింగ్ రాజ్ ఠాకూర్ – రామ‌గుండం

గ‌డ్డం వినోద్ – బెల్లంప‌ల్లి