EXCLUSIVE: AIMIM మ‌త రాజ‌కీయాలు చేస్తే ఒప్పుకోం అంటున్న కాంగ్రెస్

EXCLUSIVE: తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీక‌ర్‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం MIM నేత అక్బ‌రుద్దిన్ ఒవైసీని (akbaruddin owaisi) నియ‌మించ‌డంపై ర‌చ్చ జ‌రుగుతోంది. ఒవైసీ స్పీక‌ర్‌గా ఉంటే తాము అసెంబ్లీ గ‌డ‌ప కూడా తొక్క‌మ‌ని BJP నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (raja singh) మాత్రం త‌న కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ఒవైసీ స‌మ‌క్షంలో ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌న‌ని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇలా ఏర్ప‌డిందో లేదో అప్పుడో మ‌త రాజ‌కీయాల ర‌చ్చ రాజుకుంది.

కాంగ్రెస్, BRS పార్టీల్లో ఎంద‌రో సీనియ‌ర్ నేత‌లు ఉన్నా కూడా MIMకి చెందిన నేత‌ను ఎందుకు ప్రొటెం స్పీక‌ర్ చేసిన‌ట్లు అనే ప్ర‌శ్న BJP వేస్తోంది. గ‌తంలో ఉన్న స్నేహాన్ని మ‌ళ్లీ కొన‌సాగించ‌డానికా మ‌ళ్లీ బ‌ల‌ప‌ర‌చ‌డానికా అని అంటోంది. దీనిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాక‌ర్ అంటున్నారు. ఒవైసీ సీనియ‌ర్ నేత‌, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్య‌క్తి కాబ‌ట్టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప్రొటెం స్పీక‌ర్‌గా ఎంపిక‌చేసింద‌ని… అందులో త‌ప్పేముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. BJP అన్ని మ‌తాల వారితోనూ సామ‌రస్యంగా ఉంటే తెలంగాణ‌లో ఇంకా సీట్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని.. లేదంటే గెలిచిన 8 సీట్లు కూడా లేకుండా పోతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

మ‌రోప‌క్క MIMకి కూడా ఇదే వ‌ర్తిస్తుంద‌ని.. MIM కూడా BJP లాగా మ‌త రాజ‌కీయాలు చేయాల‌ని చేస్తే చూస్తూ ఊరుకోం అని ద‌యాక‌ర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగ బ‌ద్ధంగానే ఒవైసీని ప్రొటెం స్పీక‌ర్‌గా నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌ని ద‌యాక‌ర్ తెలిపారు. BJP వారికి ఎందుకు ముస్లింలంటే అంత క‌క్ష‌.. ఒవైసీని ప్రొటెం స్పీక‌ర్‌ని చేస్తే వారికి వ‌చ్చిన నెప్పేంటి అని ద‌యాక‌ర్ ప్ర‌శ్నిస్తున్నారు. ప్రొటెం స్పీక‌ర్ అంటే ఒక్క రోజు ఉండే వ్య‌క్తే అని ఆ మాత్రం దానికి ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.