Congress: కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తెస్తేనే ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతుంది
Congress: కేంద్ర ప్రభుత్వం అమెరికా, యూరోపియన్ యూనియన్‌పై ఒత్తిడి తెస్తేనే ఇజ్రాయెల్ గాజాపై (israel gaza war) యుద్ధం ఆపుతుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (jairam ramesh). అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడితే కాంగ్రెస్ తీవ్రంగా ఖండించగా.. మళ్లీ ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్ గాజాలోని హమాస్‌పై దాడులు చేస్తుంటే ఇది మారణహోమం అని అంటోంది. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేసినప్పుడు ఇది తప్పు వెంటనే ఆపండి అని పిలుపునిచ్చిన కొన్ని శక్తిమంతమైన దేశాలు ఇప్పుడు గాజా విషయంలో నోరు మూసుకుని కూర్చోవడం సబబు కాదని అన్నారు.