Congress: జగన్ జైలుకి పంపినా ప్రజాదరణతో సీఎం అయ్యాడు
Congress: కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పొగడ్తలతో ముంచడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ బాబుపై ప్రశంసల జల్లులు కురిపించారు. రాజకీయం కోసం పుట్టిన నేత చంద్రబాబు నాయుడు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబును, జగన్ జైలుకు పంపినా ప్రజల ఆదరణతో సీఎం అయ్యాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడును పొగడడం ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు.