Congress: ప్చ్.. అలా అనకుండా ఉండాల్సింది!
ఇజ్రాయెల్‌పై పాలెస్తీనా యుద్ధం (israel palestine war) చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ (congress) పాలెస్తీనాకు సపోర్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇజ్రాయెల్‌పై పాలెస్తీనాకు చెందిన హమాస్ (hamas) అనే ఉగ్రవాద సంస్థ భీకర దాడులకు పాల్పడింది. వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందిస్తూ.. పాలెస్తీనాకే తమ సపోర్ట్ అని సొంత నేలపై గౌరవంగా బతకాలని అందరూ కోరుకుంటారని వెల్లడించింది.
కాంగ్రెస్ ఉద్దేశం ఏదైనప్పటికీ వారు హమాస్ సంస్థకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా BJP నేతలు కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతున్నారు. కాంగ్రెస్ ప్రేమ ఆప్యాయత అంటూ మాట్లాడుతుంది కానీ నిజానికి కాంగ్రెస్ ఉగ్రవాదానికే సపోర్ట్ చేస్తోందని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడిన వేళ కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.