Karnataka Elections: కాంగ్రెస్‌.. అన్‌స్టాప‌బుల్!

Bengaluru: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో(karnataka elections) కాంగ్రెస్‌దే(congress) హ‌వా అనేలా ఫ‌లితాలు ఉన్నాయి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయ‌డానికి కావాల్సిన మెజార్టీ మార్క్‌ను కాంగ్రెస్ దాటేసింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఆస‌క్తిక‌ర‌మై ట్వీట్ చేసింది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఫొటోను పెట్టి ఐ యామ్ ఇన్విన్సిబుల్, ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ యామ్ అన్‌స్టాప‌బుల్ టుడే అని ట్వీట్ చేసింది. ఇప్ప‌టికే దిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్‌లో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి.