Congress: రేవంత్ ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు
కాంగ్రెస్ (congress) నేత, TPCC చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించిన సంగతి తెలిసిందే. పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతా అంటూ రేవంత్ తప్పుడు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయన ఇంటి ముందు ఉండాల్సిన గన్‌మెన్ కొన్ని రోజులుగా రావడంలేదు. ఇప్పటికే రేవంత్‌పై చాలా కేసులు నమోదయ్యాయి. ఆయన పోలీసులకు క్షమాపణలు చెప్పేవరకు సెక్యూరిటీకి వెళ్లకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందట. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ రేవంత్ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తికి సెక్యూరిటీని తగ్గించి ఆయన ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారని ఆరోపణలు చేసింది.
పోలీసులు వారంతట వాటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరని ప్రభుత్వం ఆదేశాల మేరకు తనకు సెక్యూరిటీని తగ్గించినట్లున్నారని రేవంత్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై రాచకొండ కమిషనరేట్ కూడా సమాధానం ఇవ్వలేదు. గురువారం ఉదయం సెక్యూరిటీకి నలుగురు రావాల్సింది కేవలం ఒకరే వచ్చారు. దాంతో రేవంత్‌కి ఒళ్లుమండింది. ఆ ఒక్కరు కూడా ఎందుకు అని వెనక్కి పంపించేసారు. రాష్ట్ర విభజన సమయంలో రేవంత్‌కు భారీ సెక్యూరిటీ ఉండేది. ఎప్పుడైతే ఆయన ఓటుకు నోటు స్కాంలో ఇరుక్కున్నారో అప్పుడు సెక్యూరిటీని తొలగించారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
రేవంత్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ ఆయనకు 24 గంటలు దాదాపు 25 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేసారని ఇప్పుడు రేవంత్‌కు సెక్యూరిటీ తీసేసి తెలంగాణలో కాంగ్రెస్ (congress) తరఫు స్టార్ క్యంపెయినర్ అయిన రేవంత్‌ను రిస్క్‌లో పెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మాత్రం బాగా సెక్యూరిటీ ఇచ్చారని ఆయన దానిని దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. (congress)