సైనికుడి తల్లి రోదిస్తుంటే చెక్ పట్టుకుని ఫోటోలకు మంత్రి పోజులు
Congress: ఓ పక్క ఉగ్రమూకల కాల్పుల్లో దేశం కోసం పోరాడుతూ అమరుడైన తన బిడ్డను తలుచుకుంటూ ఆ తల్లి రోదిస్తుంటే.. ఈ చెక్కు తీసుకుంటూ ఫోటోలకు పోజులివ్వమ్మా అన్నట్లు ఆ మంత్రి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసారా. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది.
ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకున్న కాల్పుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ శుభం గుప్తా అమరుడయ్యారు. దాంతో శుభం తల్లి రోదనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ తాను వచ్చిన పని చూసుకుని వెళ్లిపోవాలని అన్నట్లు ప్రవర్తించాడు. శుభం తల్లి ఏడుస్తుంటే ఆమె ముందు చెక్ పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చారు. ఆ సమయంలో తీసిన వీడియోను కాంగ్రెస్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ మీరు మనుషులా రాబందులా అని మండిపడింది. BJPలో B అంటే బేషరమ్ (సిగ్గులేని) P అంటే (పబ్లిసిటీ) అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (aap) నేతలు కూడా మండిపడ్డారు.