EXCLUSIVE: ప‌రామ‌ర్శించినంత‌ మాత్రాన వ‌దిలేస్తాం అని కాదు.. అన్ని లెక్క‌లు తేలుస్తాం

EXCLUSIVE: తెలంగాణ మాజీ సీఎం KCRకు శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌డంతో ప్ర‌స్తుతం య‌శోదా హాస్పిట‌ల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు, న‌టుడు చిరంజీవి KCRను క‌లిసి ప‌రామ‌ర్శించారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత‌లు అయిన రేవంత్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క KCRను క‌లిసినంత మాత్రాన BRS ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పిదాలు, అవినీతి ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తాం అని కాద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత రామ్మోహ‌న్ రెడ్డి (ram mohan reddy).

ఇప్ప‌టికే విద్యుత్ బ‌కాయిలు రూ.85,000 కోట్ల వ‌ర‌కు ఉన్నాయ‌ని అంటున్న కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన కేసుల‌ను తోడుతోంది. అన్ని శాఖ‌ల‌కు సంబంధించి శ్వేత‌ప‌త్రాల‌ను రిలీజ్ చేయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఎవ‌రు క‌ట్టినా బాధ్యులు మాత్రం వారే అవుతార‌ని వాటి లెక్క‌లు కూడా తేలుస్తామ‌ని తెలిపారు. కాంగ్రెస్ నేత‌లు KCRను ప‌రామ‌ర్శిస్తే మాజీ సీఎం కాబ‌ట్టి మంచి మ‌న‌సుతో ప‌రామ‌ర్శించారు అనుకోవాలే త‌ప్ప కాంగ్రెస్ క‌లిసిపోయాయ‌ని చ‌ర్చించుకుంటే అంత‌కంటే పెద్ద పొర‌పాటు మరొక‌టి ఉండ‌ద‌ని రామ్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేసారు.