Congress: అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ తొలి సంతకం

Congress: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) డిక్లరేషన్ ప్రకటన చేసారు. అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ తొలి సంతకం పెడ‌తార‌ని హామీ ఇచ్చారు. తిరుపతి తారక రామ గ్రౌండ్ లో APCC ప్రత్యేక హోదా సాధన సభ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిళ మాట్లాడుతూ..

“””” 10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తాం. హోదా పై మూడు నామాల వానికే మోడీ పంగనామాలు పెట్టాడు. పంగనామాలు పెట్టిన మోడీ ఒక కేడీ. మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ. హోదా అడిగితే తల్లిని చంపి బిడ్డను వేరు చేశాడు అంటున్నాడు. నిజానికి తల్లి లాంటి ఆంధ్రను చంపింది మోడినే. హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోడీ చంపాడు. పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుంది మోడీనే. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంపింది మోడీనే. ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళు కావాలా ? హోదాను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా ? కోమాలో ఉన్న కాంగ్రెస్‌లో నేను చేరింది కేవలం విభజన హామీల సాధన కోసమే. హోదా కోసం అరాట పడే వాళ్ళ మద్య..హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య జరుగుతున్న పోరాటం. ప్రత్యేక హోదా తో పాటు YSR సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకు వస్తా. తిరుపతిలో ఇదే మైదానం వేదికగా మోడీ హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఇక్కడే నిలబడి హామీ ఇచ్చారు. ఆ సభలో ఎన్నో మాటలు చెప్పాడు. ఆంధ్ర ప్రజల అవేదన నాకు తెలుసు అన్నాడు. మీ బాధ నాకు తెలుసు అని నమ్మించాడు. (Congress)

అధికారం వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా ఇస్తా అన్నాడు. ఆంధ్ర రూపు రూపు రేఖలు మారుస్తా అన్నాడు. న్యూ ఢిల్లీ చిన్నబోయే రాజధాని సహకారం అన్నాడు. ఆంధ్రలో హర్డ్ వేర్ హబ్ అన్నాడు. ఇంధన యూనివర్సిటీ అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేక పోయాడు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా మన హక్కు. కాంగ్రెస్ ప్ర‌ భుత్వం ఏపి విభజన చట్టంలో పెట్టింది. విభజన హామీలు మన హక్కు. హోదా మన హక్కు,పోలవరం మన హక్కు. కడప స్టీల్ మన హక్కు, దుగ్గరాజ పట్నం పోర్ట్ మన హక్కు. ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ మన హక్కు. మన హక్కులు మనకు లభిస్తున్నాయా ? లేదా ? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి.

ALSO READ: చెల్లి ఏదో అడుగుతోంది.. స‌మాధానం చెప్పు జ‌గ‌న్

హక్కుల సాధనలో బాబు,జగన్ విఫలం. ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదు. కనీసం నిలబడలేదు కూడా. విభజన జరిగి 10 ఏళ్లు దాటింది.10 ఏళ్లు దాటినా ఒక్క హామీ సాధించుకొలేదు. హోదా సాధనలో బాబు,జగన్ మాట మార్చారు. 15 ఏళ్లు హోదా కావాలని బాబు అడిగారు. తర్వాత హోదా అడిగితే జైల్లో పెట్టారు. ఊసరవెల్లి లా రంగులు మార్చారు. ఈయన రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. జగన్ ఆన్న 25ఎంపీలు కావాలని అడిగారు. హోదా కోసం దీక్షలు చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దాం అన్నాడు. కేంద్రంపై పంజా విప్పుదాం అన్నాడు. పులిలా గర్జించి అధికారం రాగానే పిల్లి అయ్యాడు. బీజేపీకి బానిస అయ్యాడు.. మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మ‌న‌ది. మన రాజధాని ఏది అంటే ఏం చెప్తాం. (Congress)

ఒక ముఖ్యమంత్రి 3D గ్రాఫిక్స్ చూపించారు. ఒక ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నాడు. 10 ఏళ్లలో ఏపికి ఏ రాజధాని లేదు. హోదా కోసం రాష్ట్రంలో యువత హత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే గ్రౌండ్ లో ముని కోటి అనే యువకుడు పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఈ పాపం బీజేపీది, బాబుది, జగన్ ది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మోసం చేసిన బీజేపీతో మళ్ళీ పొత్తులకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న వీళ్ళు మనకు అవసరమా ? ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మోడీ దగ్గర తాకట్టు పడింది. రెండు పార్టీలు మోడీకి ఊడిగం చేస్తున్నాయి. మోడీ ఇద్దరినీ చేతుల్లో పెట్టుకొని ఆట అడిస్తున్నాడు. 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఊసు లేకుండా చేశారు. హోదాపై రాజకీయం చేసి పీఠం పెట్టారు. అధికారం అనుభవిస్తూ హోదాను మరిచారు. ప్రత్యేక హోదా వస్తె ఎంతో అభివృద్ధి జరిగేది.

హోదా పొందిన రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగింది. వేలల్లో పరిశ్రమల స్థాపన జరిగింది. రాయితీలు కారణంగా ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. మనకు హోదా వచ్చి ఉంటే ఏపి ఎంతో అభివృద్ధి జరిగేది. రాష్ట్ర అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి పోవడానికి వీళ్ళే కారణం. విభజన హామీలు కాదు..స్థానిక హామీలు కూడా అమలు కానీ పరిస్థితి. ఉద్యోగాలు పేరు చెప్పి యువతను మోసం చేశారు. రేవు దాటెంత వరకే ఓడ మల్లన్న…తెప్ప దాటాక బోడి మల్లన్న. జగన్, బాబు ఇద్దరు బోడి మల్లన్నలు. మద్య నిషేధం అని చెప్పి సర్కార్ మద్యం అమ్ముతోంది. కల్తీ మద్యంతో రాష్ట్రంలో 25 శాతం మరణాలు పెరిగాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నిండా ముంచారు. జగన్, బీజేపీ, బాబు రాష్ట్రాన్ని మోసం చేసే వాళ్ళు. వీళ్ళతో ఏది సాధ్యం కాదు“””” అని విమ‌ర్శ‌లు గుప్పించారు ష‌ర్మిళ‌.