Flying Kiss Issue: ముసలిదానికి ఫ్లయింగ్ కిస్ ఏంటి?
Delhi: రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో (parliament) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఫ్లయింగ్ కిస్ (flying kiss issue) ఇచ్చిన ఘటనపై మరో కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. రాహుల్ లోక్‌సభలోని కుర్చీలకు ఫ్లాయింగ్ కిస్ ఇచ్చారే తప్ప ఎవ్వరినీ ఉద్దేశించి కాదని ఆల్రెడీ కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. కానీ BJP నేత స్మృతి ఇరానీ మాత్రం తమ వైపు చూస్తూనే రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై బిహార్‌కి కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ (neetu singh) మాట్లాడుతూ.. “” మా రాహుల్ కావాలనుకుంటే అమ్మాయిలకు కొరతే లేదు. అలాంటిది 50 ఏళ్ల ముసలిదానికి ఎందుకు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు?“” అని కామెంట్ చేయడంతో అది మరింత దుమారానికి దారి తీసింది.