మాట వినని కమిషనర్‌ను బదిలీ చేయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Congress: ఖాకీ ముందు ఖద్దరే గెలిచింది. అధికార కాంగ్రెస్ లీడర్ల ఒత్తిడితో ఓ మంచి పోలీసు కమిషనర్ బదిలీ అయ్యారు. ఇంటా, బయటా అక్రమాలకు కళ్లెం వేసిన నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్‌ను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సర్వీసులకు బదిలీ చేసేసింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం నిషేధం, పేకాట రాయుళ్లను, వ్యభిచారం, గంజాయి అమ్మకం, ఇతర అక్రమ దండాలపై ఉక్కుపాదం మోపారన్న పేరు కమిషనర్ కల్మేశ్వర్‌కు ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేశారాయన. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. దాంతో కాళేశ్వర్ని పంపించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడంతో ఆయన బదిలీ అయ్యారు. కమిషనర్ కల్మేశ్వర్‌తో పాటు ఆయన భార్య రోహిణి ప్రియదర్శనిని కూడా బదిలీ చేసారు. నేషనల్ పోలీస్ అకాడమీ అదనపు డైరెక్టర్లుగా వీరిని నియమించారు.