Rahul Gandhi: డెలివ‌రీ బాయ్ స్కూట‌ర్ ఎక్కిన రాహుల్

Bengaluru: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ(rahul gandhi) డెలివరీ బాయ్ స్కూట‌ర్ ఎక్కి రైడ్‌కి వెళ్లారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు(karnataka elections) స‌మీపిస్తున్న నేప‌థ్యంలో లాస్ట్ క్యాంపెయిన్‌లో భాగంగా అగ్ర పార్టీల‌న్నీ త‌మ వంతు కృషి చేస్తున్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో పూర్త‌య్యాక రాహుల్ త‌న ప్ర‌చారం మొద‌లెట్ట‌నున్నారు. ఓ పబ్లిక్ మీటింగ్‌కి హాజ‌రైన రాహుల్‌.. తిరిగి త‌న హోట‌ల్‌కు వెళ్తేందుకు డెలివ‌రీ బాయ్ స్కూటర్ ఎక్కి 2 కిలోమేట‌ర్ల మేర ప్ర‌యాణించారు. మ‌రోప‌క్క మోదీ రోడ్ షో కోసం ఓ భారీ వాహ‌నానికి పూలు, త‌న ఫొటోల‌ను అలంక‌రించి.. అక్క‌డే ఉన్న ప్ర‌జ‌ల చేత త‌న‌పై పూల వ‌ర్షం కురిపించుకున్నారు. కానీ రాహుల్ మాత్రం అటువంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా డెలివ‌రీ బాయ్ స్కూటర్ ఎక్కి త‌న హోట‌ల్‌కి చేరుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మే 10న క‌ర్ణాట‌కలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్న‌ట్లు పోటీప‌డుతున్నాయి.