Congress MLA: రేప్ ఒక్కరితో అయ్యే పని కాదు.. 3 కావాలి
కర్ణాటకకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే (congress mla) అమరగౌడ (amaregouda) అత్యాచారానికి గురైన బాధితురాలి పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అక్టోబర్ 16న అమరగౌడ సహాయకుడు సంగెనగౌడ కొప్పల్ జిల్లాలోని తవర్గెరా పట్టణానికి చెందిన ఓ యువతి పొలంలో పనిచేస్తుండగా ఆమెపై దాడి చేసి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తండ్రి న్యాయం కోసం అమరగౌడ వద్దకు వెళ్లగా అతను మరీ దారుణంగా మాట్లాడారు.
రేప్ జరిగిందని తెలిస్తే కుటుంబ పరువు పోతుందని.. అందుకే వేరేగా మార్చి కంప్లైంట్ రాసివ్వాలని కోరడమే కాకుండా ఈ ప్రపంచంలో ఒక్కరే రేప్ చేయడం సాధ్యమయ్యే పని కాదని కనీసం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదని దానికి ఇద్దరు ముగ్గురు ఉండాలని అన్నారు. ఆ సమయంలో ఆయన మాటల్ని రికార్డ్ చేసి లీక్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి మీడియా వర్గాలు అమరగౌడను ప్రశ్నించగా.. తనను ఇలా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారని అనుకోలేదని ప్రస్తుతం తను బాగా డిస్టర్బ్ అయ్యి ఉన్నానని ఏమీ మాట్లాడలేనని తెలిపారు.