Siddaramaiah: కన్న‌డ‌ పెద్ద‌న్న గురించి ఈ విష‌యాలు తెలుసా..!?

Bengaluru: క‌న్న‌డ‌నాట(karnataka) సిద్ధ‌రామ‌య్య‌కు(siddaramaiah) ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అంటారు ఆయ‌న్ని. క‌న్న‌డ పెద్ద‌న్న‌గా పేరొందిన సిద్ధ‌రామ‌య్య కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధుల్లో ఒక‌రు. రేపు సీఎం ప‌ద‌వికి ఈయ‌నే కట్ట‌బెడ‌తారా? లేదా? అనేది వేచి చూడాలి. ఈ నేప‌థ్యంలో సిద్ధ‌రామ‌య్య గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

* సిద్ధ‌రామయ్య మైసూరు జిల్లాలోని వ‌రుణ హొబ్లి ప్రాంతంలో ఆగ‌స్ట్ 3, 1947లో జ‌న్మించారు.

* 2013-2018 వ‌ర‌కు కంగ్రెస్ త‌ర‌ఫున క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

*మైసూరు యూనివ‌ర్సిటీ నుంచి BSc, LLB చేసారు.

*1978లో ఆయ‌న పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1983లో లోక్‌ద‌ళ్ పార్టీ త‌ర‌ఫున చాముండేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి గెలుపొందారు.

*జ‌న‌తా ద‌ళ్ పార్టీ త‌ర‌ఫున టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తే.. ఆ పార్టీకి అప్ప‌టి అధ్య‌క్షుడు దేవె గౌడ టికెట్ ఇవ్వ‌లేదు. దాంతో అలిగిన సిద్ధ‌రామ‌య్య‌.. అబ్దుల్ న‌జీర్ సాబ్‌ను ఆశ్ర‌యించారు. అబ్దుల్.. క‌ర్ణాట‌క‌లో పంచాయ‌త్ రాజ్‌ను స్థాపించారు. ఆయ‌న సిద్ధ‌కు మెంటార్‌.

*సిద్ధ కురుబా కమ్యూనిటీకి చెందిన‌వారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

*దేవ‌రాజ్ ఉర్స్ త‌ర్వాత క‌ర్ణాట‌క సీఎంగా 5 ఏళ్లు ప‌నిచేసిన మొద‌టి వ్య‌క్తి సిద్ధ‌నే. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రూ కూడా పూర్తి 5 ఏళ్లు సీఎంగా కొన‌సాగలేదు.

*13 సార్లు డిప్యూటీ సీఎంగా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త కూడా సాధించారు. క‌ర్ణాట‌క దివంగ‌త మాజీ సీఎం రామ‌కృష్ణ హెగ్డే త‌ర్వాత అంత‌టి రికార్డు సిద్ధ‌రామ‌య్య‌దే.