Rahul Gandhi: 5 హామీలు నిల‌బెట్టుకుంటాం

Bengaluru: క‌ర్ణాట‌క ఎన్నిక‌లకు(karnataka elections) ముందు చేసిన ఐదు హామీల‌ను నిల‌బెట్టుకుంటామ‌ని అన్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(rahul gandhi). క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందిన నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను ద్వేషంతో పోరాడ‌లేద‌ని అన్నారు. “క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచాం. అమాయ‌క ప్ర‌జ‌లు ద్వేష‌పూరిత రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పారు. ప్రేమ‌తోనే ఈ ఎన్నిక‌ల్లో పోరాడాం. మా గెలుపుకి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు. మొద‌టి కేబినెట్ మీటింగ్‌లోనే మేం చేసిన 5 హామీల‌ను నిల‌బెట్టుకుంటాం” అని తెలిపారు.