Congress: చంద్రబాబు మాతో కలిస్తే ప్రత్యేక హోదా పక్కా
Congress: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడగాలని.. మరి ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన ట్వీట్ చేసారు.
2018 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసమే బాబు ఎన్డీయే కూటమితో చేతులు కలిపారని.. ఆ తర్వాత ఐదేళ్లలో అసలు ప్రత్యేక హోదా ఊసే ఎత్తకపోవడంతో 2018 సమయంలో ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చేసారని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక హోదా గురించి మోదీ మాటివ్వలేదని.. అలాంటప్పుడు మళ్లీ ఆయనతో ఎలా కలుస్తారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తుందని.. చంద్రబాబు నాయుడు తమతో కలిస్తే ఆయన ప్రతి డిమాండ్‌ను నెరవేరుస్తామని అన్నారు.