Telangana Elections: 2019 ఫార్ములా రిపీట్..!

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్, BJP పార్టీలు 2019 లోక్ సభ ఎన్నికల ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. ఈ రెండు పార్టీలు KCR మీద చెరో చోట పోటీకి సిద్ధ‌మ‌య్యాయి. KCR మీద గజ్వేల్‌లో (gajwel) పోటీకి ఆల్రెడీ BJP నాయకుడు ఈటెల రాజేందర్ (etela rajender) సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేత‌, PCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కామారెడ్డి (kamareddy) నుంచి KCRపై పోటీకి సిద్ధం అని ప్ర‌క‌టించారు. ఇందుకు కాంగ్రెస్ హైక‌మాండ్ ఒప్పుకుంటే త‌ప్ప‌కుండా పోటీ చేస్తాన‌ని అన్నారు. BJP పోటీ చేసిన చోట కాంగ్రెస్ పోటీ చేయకుండా… కాంగ్రెస్ పోటీ చేసిన చోట BJP పోటీ చేయకుండా పార్టీలు జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయి.