Karnataka Elections: గంపెడు ఆశలతో కాంగ్రెస్, బీజేపీ..!
Bengaluru: కర్నాటక ఎన్నికల్లో(karnataka elections) గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్(congress), బీజేపీ(bjp) పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. గెలవడం కోసం.. సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్నాటకలో ఫలితం.. కాంగ్రెస్, బీజేపీలు సౌత్‌లో బలంగా పాతుకుపోయేలా చేయనున్నాయి. దీంతోపాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. మరో ఆరు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అన్ని అస్త్రాలను సందిస్తోంది. కాంగ్రెస్ పనైపోయిందని, ఆ పార్టీ వేర్పాటు వాద ధోరణిలో వెళ్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యం కావాలని ఇటీవల అనేక పార్టీలు భావిస్తున్నాయి. అయితే.. ఈ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడాన్ని అనేక ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇతర ప్రతిపక్షాలు ఆహ్వానించాలంటే.. కర్నాటకలో గెలవడమే ఆ పార్టీకి ఉన్న ఏకైక మార్గం. అంతేకాకుండా.. కర్నాటక గెలవడం వల్ల కాంగ్రెస్‌కు రిసోర్సు ఏర్పడతాయి. అంటే లోక్‌సభ ఎన్నికలకు పలవురు నిధులు సమాకూర్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు చాలా కీలకం కానుంది. ఆ పార్టీ మనుగడ, భవిష్యత్తుకు ఇది నాంది పలకనుంది. మరోవైపు బీజేపీ కూడా కర్నాటకలో అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్నాటకలో గెలవడం ద్వారా తెలంగాణకు ఆ పార్టీ బలమైన సంకేతాన్ని గెలవనుంది. అంతేకాకుండా.. సౌత్‌లో బీజేపీకి ఎంట్రీ గేట్గా ఉన్న కర్నాటకలో.. ఎట్టిపరిస్థితుల్లో గెలుపు అవకాశాలను వదులుకునే ఆలోచనలో బీజేపీ లేదు. ఇక అక్కడి ప్రజల తీర్పు ఈవీఎంలలో ఇవాళ నిక్షిప్తం కానుండగా.. ఈనెల 13న ఫలితం తేలనుంది.