Congress: మీకు జీతమే రాదు కదా.. హోటల్ రూం ఎలా బుక్ చేసారు?
కాంగ్రెస్ (congress) నేత అధిర్ రంజన్ చౌదరి (adhir ranjan chowdhury) ఎన్నికలకు ముందు అనవసరంగా లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నారు. ఇండియా కూటమిలో (india bloc) భాగమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (mamata banerjee) మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసారు. ఇటీవల మమతా స్పెయిన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమె రూ.3 లక్షలు విలువైన హోటల్ రూంలో స్టే చేసారట.
దీనిపై అధిర్ స్పందిస్తూ.. “” అసలు జీతమే తీసుకోని ముఖ్యమంత్రి.. కేవలం తాను వేసిన పెయింటింగ్స్ ద్వారా వచ్చే డబ్బుతో బతుకుతున్న దీదీకి రోజుకు రూ.3 లక్షలు పెట్టి హోటల్ గదిని బుక్ చేసుకునేంత డబ్బు ఎక్కడిది? ఇక్కడ డెంగూతో ప్రజలు అల్లాడిపోతుంటే వారి పెయిన్ (బాధ) ఆమెకు పట్టదు కానీ దీదీ మాత్రం స్పెయిన్ పర్యటనకు వెళ్తారు. స్పెయిన్ ట్రిప్పై ఎంత ఖర్చు చేసారు? ఏ పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చారు? మమ్మల్ని ఫూల్ చేయకండి. మీరు విశ్వ బంగ్లా ఇండస్ట్రియల్ మీట్ కోసం ఖర్చు పెట్టిన దాంట్లో నుంచి 10% తీసి ప్రజల కోసం వాడినా బెంగాల్ యువతకు ఉద్యోగాలు వచ్చేవి. బెంగాల్లో స్పెయిన్‌కి చెందిన ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయో మీరు చెప్పి తీరాల్సిందే. “” అంటూ కామెంట్స్ చేసారు.
మొన్న జరిగిన జీ20 సమ్మిట్‌లో భాగంగా ప్రెసిడెంట్ డిన్నర్ ఈవెంట్‌కి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. ఈ డిన్నర్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలవగానే మమతా వెళ్లారని అధిర్ ఆమెపై కోపం పెంచుకున్నారు. ఇండియా కూటమిలో భాగమై.. BJPని ఓడించాలనుకుంటున్నప్పుడు వారు పిలవగానే వెళ్లాల్సిన అవసరం ఏముందని అప్పుడే అధిర్ ప్రశ్నించారు. దీనిపై TMC కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఎన్నికల ముందు ఒకే కూటమిలోని రెండు కీలక పార్టీ నేతలు ఇలా కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. (congress)