మీ గొడవలు ఆంధ్రాలో చేసుకోండి.. TDP నేతపై ఆగ్రహం
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు (chandrababu naidu) నిరసనగా లెట్స్ మెట్రో ఫర్ CBN అనే కార్యక్రమాన్ని చేపట్టారు కార్యకర్తలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు మెట్రో రైళ్లల్లో ప్రయాణించి నిరసన తెలిపారు. తెలంగాణలో (telangana) చంద్రబాబుకు మద్దతుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని.. అలా చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి KTR ఆదేశాలు జారీ చేసారు. అయినా కూడా TDP కార్యకర్తలు వినలేదు.
ఈ నేపథ్యంలో ఓ సామాన్య వ్యక్తి రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం ఏడుస్తున్న మహిళా TDP కార్యకర్తలపై మండిపడ్డాడు. మీ లొల్లి ఆంధ్రాలో చేసుకోండి. కావాలంటే జగన్ *** మీద తన్నండి. అంతేకానీ ఇక్కడ ఎలాంటి నిరసలు చేయకండి అని మండిపడ్డాడు. దాంతో అతనికి TDP నేతలకు మధ్య వివాదం జరిగింది.