Revanth Reddy: KTR చేసిన మంచి ప‌ని ఇదే.. CM పొగ‌డ్త‌

Revanth Reddy: BRS ఎమ్మెల్యే KTRని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పొగిడారు. ఇటీవ‌ల అన్న‌పూర్ణ అనే ఓ మ‌హిళ ప్ర‌జావాణిలో త‌న గోడు చెప్పుకుందామ‌ని వెళ్తే ఎవ్వ‌రూ ప‌ల‌క‌లేదు. దాంతో ఆమె తెలంగాణ భ‌వ‌న్‌కు వెళ్లి KTRను క‌లిసింది. KTR ఆమెను ఇంటికి తీసుకెళ్లి ల‌క్ష రూపాయ‌ల సాయం చేసారు. ఈ విష‌యం గురించి రేవంత్ స్పందిస్తూ… KTR ఆమెకు సాయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని.. ఇన్నాళ్లూ దోచుకున్న ల‌క్ష‌ల కోట్ల నుంచి ఒక ల‌క్ష తీసి ఆ ఆడ‌బిడ్డ‌కు సాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు.

ఓ ర‌కంగా KTR ఆమెకు సాయం చేయ‌డానికి కార‌ణం త‌మ ప్ర‌జా వాణి కార్య‌క్ర‌మ‌మే అని అన్నారు. ప్ర‌జా వాణి కార్యక్ర‌మానికి ఆమె రాక‌పోయిన ఉంటే KTRని క‌లిసేదే కాదు ఆయ‌న సాయం చేసేవారే కాదు అని ఈ పాయింట్‌పై కూడా BRS ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు రేవంత్. భవిష్య‌త్తులో కూడా ప్ర‌జా వాణి కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకెళ్తామ‌ని అన్నారు.