cm jagan: ముఖ్యనేతలతో అత్యవసర భేటీ.. కారణం ఇదే!

vijayawada: ఏపీ సీఎం జగన్‌(cm ys jagan) ఇవాళ ముఖ్యనేతలతో అత్యవసరంగా భేటీ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు(tadepalli camp office) కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి(yv subba reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajja ramakrishna reddy), ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(chevireddi bhaskar reddy) హాజరయ్యారు. నిన్న సీఎం అనంతపురం పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక ఇవాళ అధికారిక సమీక్షలు కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. అయితే.. కోడికత్తి(kodi kathi case) కేసు ఎన్‌ఐఏ కోర్టులో విచారణకు రాగా… మరోవైపు మాజీ మంత్రి వివేకా హత్య కేసు(viveka murder case)లో ఎంపీ అవినాష్‌ రెడ్డి(avinash reddy)కి సీబీఐ నోటీసులు ఇవ్వడం.. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని నిన్న అరెస్ట్‌ చేయడంపై వంటి అంశాలపై సీఎం జగన్‌ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. ఇవాళ అవినాష్‌ రెడ్డి అరెస్టు అయితే.. ఏ విధంగా వైసీపీ తరపున న్యాయ పోరాటం చేయాలని.. తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.

కోడి కత్తి కేసుపై కూడా ఇవాళ ఏదో ఒక తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీనిపై కూడా జగన్‌ దృష్టి సారించినట్లు సమాచారం. అయితే.. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంలో జగన్‌ మీద ఉన్న అభిమానంతో చేశానని చెప్పుకొస్తున్నాడు. తనను టీడీపీ ప్రభావితం చేయలేదని అంటున్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి, వివేకా హత్య కేసు వంటివి జగన్‌పై సానుభూతిని తీసుకొచ్చాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు అవన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మారిపోయాయి. ప్రధానంగా అవినాష్‌ను అరెస్టు చేస్తారు అనే వార్తలు రావడంతో.. ఈ కేసుకు సంబంధించి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ మాత్రం దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. జగన్‌ అడ్డంగా దిరికిపోయారని.. గతంలో జగన్‌ మాట్లాడిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు.