EXCLUSIVE: జ‌న‌సేన‌లోకి అన్న‌య్య‌?

EXCLUSIVE: జ‌న‌సేన‌లోకి (janasena) మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఒక‌ప్పుడు ప్ర‌జా రాజ్యం పార్టీ పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన చిరు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వారితోనే ఓడించార‌ని ఆ త‌ర్వాత రాజ‌కీయాలంటే అస‌హ్యం వేసింద‌ని చిరు ఓ సంద‌ర్భంలో తెలిపారు. అందుకే ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేను చేసి చూపిస్తా అన్న‌య్యా అంటూ జ‌న‌సేన పేరిట పార్టీ స్థాపించారు. చిరు వ‌ద్దు అంటున్నా విన‌ని ప‌వ‌న్ పార్టీ పెట్టి ఇక్క‌డి దాకా వ‌చ్చారు. ఏదైతే అదైంది అని చిరు, నాగ‌బాబు పవ‌న్ వెనుకే నిల‌బ‌డ్డారు. అయితే ఇప్పుడు చిరు కూడా జ‌న‌సేన‌లో భాగం కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలు ముగిసాక చిరు పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అప్ప‌టివ‌ర‌కు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేయాల‌ని అనుకుంటున్నారు. త‌మ్ముడు ఇచ్చిన ధైర్యంతోనే చిరు జ‌న‌సేన‌లోకి రాబోతున్న‌ట్లు టాక్