US మిలిట‌రీలోకి టూరిస్ట్‌లుగా చైనా గూఢచారులు?

అస‌లే చైనా (china), అమెరికా (us) దేశాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గ‌మ‌నేంత వైరం ఉంది. ఈ స‌మ‌యంలో వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ (wall street journal) ఒక షాకింగ్ రిపోర్ట్‌ను బ‌య‌ట‌పెట్టింది. చైనాకు చెందిన కొంద‌రు గూఢచారులు టూరిస్ట్‌లుగా వ‌చ్చి అమెరికా మిలిట‌రీ బేస్‌లోని సెన్సిటివ్ ప్రాంతాల్లోకి చొర‌బ‌డ్డార‌ట‌. ఇలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు కొన్ని వంద‌ల సార్లు జ‌రిగింద‌ని రిపోర్ట్‌లో పేర్కొంది. ఇది క‌చ్చితంగా గూఢ‌చ‌ర్య‌మేన‌ని (espionage) తెలిపింది. అయితే ఈ రిపోర్ట్‌పై అటు చైనా కానీ ఇటు అమెరికా కానీ ఇంకా స్పందించ‌లేదు. గ‌తేడాది డిఫెన్స్ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బీఐ, ఇత‌ర ఏజెన్సీలు రివ్యూ మీటింగ్ ఏర్పాటుచేసి టూరిస్ట్‌లుగా వ‌స్తున్న‌వారికి స‌రైన ఆథ‌రైజేషన్ లేకుండా మిలిట‌రీ బేస్‌లోకి పంపించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. (us)

కొన్ని ఏళ్ల వ‌ర‌కు అలా మిలిటరీ బేస్‌లోకి ప్ర‌వేశించిన వారిలో చైనాకు చెందిన ప‌ర్యాట‌కులు కూడా ఉన్నార‌ని వారు న్యూ మెక్సికో నుంచి అమెరిక‌న్ ప్ర‌భుత్వం రాకెట్ లాంచ్ చేసే ఫ్లోరిడా సైట్ స‌మీపంలో ఉన్న మురికి నీటిలో స్కూబా డైవింగ్ చేసుకుంటూ అమెరిక‌న్ మిస్సైల్ రేంజ్‌ని క్రాస్ అయిన‌ట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప‌ర్యాట‌కం ఎక్కువ‌గా లేని చిన్న ప్రాంతాల్లోనే జ‌రుగుతుంటాయ‌ని అలాంటి ప‌ర్యాట‌కుల నుంచి చైనా ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా ఏం చూసారో చెప్పాలంటూ స‌మాచారాన్ని సేక‌రిస్తోంద‌ని జ‌ర్న‌ల్ రిపోర్ట్‌లో పేర్కొంది. (us)

అస‌లే అమెరికా గ‌గ‌న‌త‌నంలోకి చైనా కొన్ని బెలూన్ల‌ను ఎగ‌ర‌వేస్తోంది. వాటిని కూల్చివేయాల‌ని అమెరికా నిఘా వేసి ఉంచింది. అమెరిక‌న్ మిస్సైల్ సెంట‌ర్ల‌పై చైనా ఈ బెలూన్ల‌తో నిఘా వేసి స‌మాచారాన్ని సేక‌రించాల‌ని చూస్తోంద‌ని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించిన రిపోర్ట్ ఏ ర‌చ్చ‌కు దారితీస్తుందో చూడాలి.