తాడేప‌ల్లి ఆఫీస్‌లో కానుక‌గా ఐఫోన్ 16

chevireddy bhaskar reddy gifted iphones to ysrcp

Chevireddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి చాలా మంది నేత‌లు, స్టాఫ్ స‌భ్యుల‌కు ఐఫోన్ 16 ఫోన్లు ద‌స‌రా కానుక‌గా ఇచ్చార‌ని టాక్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ స్టాఫ్‌కి పండుగ‌ల‌కు ఐఫోన్లు, ట్యాబ్‌లు కానుక‌గా ఇచ్చేవారు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. దాంతో ద‌స‌రా కానుక‌లు ఎవ్వ‌రికీ అంద‌లేదు. ఈ నేప‌థ్యంలో చెవిరెడ్డి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నుంచి తాడేప‌ల్లిలోని పీఆర్వోలు, స్టాఫ్ స‌భ్యుల‌కు ఐఫోన్ 16 కానుక‌గా ఇచ్చార‌ట‌. పార్టీలో నెంబ‌ర్ 2 స్థానాన్ని చెవిరెడ్డి ఆశిస్తున్న‌ట్లు కూడా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.