Chandrababu: వివేకా హత్య కేసు చూసే వారికే ప్రభుత్వ కేసులు!
Amaravathi: TDP అధినేత చంద్రబాబు(chandrababu) ముఖ్యనేతలతో ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పరిధిలో ఇతర ప్రాంతాల్లో వున్న పేదలకు YCP ప్రభుత్వం అక్కడ భూములను కేటాయించింది. అయితే.. రాజధాని కాని ప్రాంతాల ప్రజలకి భూములు ఇవ్వడానికి వీల్లేదని TDP ప్రభుత్వం, రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్ట్ నిన్న ఇచ్చిన తీర్పులో అమరావతి R-5 జోన్లో ఎవరికైనా భూములు కేటాయించవచ్చని చెప్పింది. దీంతో చంద్రబాబుకు సుప్రీంలో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో TDP నాయకులకు ఈ అంశంపై పోరాడాలని దిశనిర్దేశం చేశారు.
దీనితో పాటు ఏపీలో(AP) విద్యుత్ కోతలు, వివేకా హత్య అంశాలపై కీలక చర్చ సాగింది. పేదల్ని మోసగించే ప్రక్రియలో భాగంగానే ఆర్-5 జోన్ – రైతులకు, పేదలకు మధ్య గొడవలు సృష్టించేందుకే ఆర్-5 జోన్ – సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌తోనే 5 శాతం పేదల భూమి గృహనిర్మాణాలకి ఉంది – 5 వేల టిడ్కోఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేశాం అని చంద్రబాబు నాయకులకు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌తోనే 5 శాతం భూమి పేదలకు కేటాయించినప్పుడు రాజధాని రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. వివేకా హత్య కేసు చూసే న్యాయవాదులకే ప్రభుత్వానికి చెందిన కేసులు అప్పగించటంలో ఆంతర్యం ఏమిటి? – వివేకా హత్య కేసు నిందితుల తరపున వాదించే న్యాయవాదులకు కేసులు అప్పగిస్తూ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని బాబు ఆరోపించారు.