ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. మద్యం షాపుల టెండర్ విషయంలో ఎవ్వరూ తలదూర్చకూడదని ఆదేశాలు జారీ చేసారు. మద్యం షాపుల టెండర్లకు భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో వాటిని ఎవ్వరూ కూడా అడ్డుకోకూడదని.. టెండర్లు వేసిన వారి పట్ల బెదిరింపులకు పాల్పడకూడదని వెల్లడించారు. రెండు రోజుల్లో 37 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 57,709 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కేవలం దరఖాస్తు రుసుంతోనే రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. 2017తో పోలిస్తే ఆదాయం మూడు రెట్లు పెరిగింది. నేడు, రేపు గడువు ఉండటంతో ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు దరఖాస్తులను నియంత్రిస్తున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. దాంతో ఆయన నేరుగా హెచ్చరించారు. దరఖాస్తులను అడ్డుకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ లేఖ జారీ చేసారు.