Chandrababu Naidu: ప్రాణ‌త్యాగానికి వెనుకాడ‌ను

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సంస్థల కేసులో భాగంగా ఈరోజు ఉద‌యం నంద్యాల‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. “” గ‌త 45 ఏళ్లుగా నేను తెలుగు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తూనే ఉన్నాను. వారి సంక్షేమం కోసం ప్రాణ త్యాగానికీ సిద్ధంగా ఉన్నాను. తెలుగు ప్ర‌జ‌ల‌కు, నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, నా జ‌న్మ‌భూమికి సేవ చేయ‌నివ్వ‌కుండా ఈ భూమిపై ఏ శ‌క్తీ న‌న్ను ఆప‌లేదు “” అని ట్వీట్ చేసారు చంద్ర‌బాబు. (chandrababu naidu arrest)