జ‌గ‌న్ ఇచ్చిన 15 ఎక‌రాల‌పై చంద్ర‌బాబు ఆరా

chandrababu naidu to investigate land allocated to swaroopanandendra

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామికి అప్ప‌టి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కేటాయించిన 15 ఎక‌రాల‌పై చంద్ర‌బాబు ఫోక‌స్ చేసారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు స్వ‌రూపానందేంద్ర స్వామి ఆయన్ను క‌లిసి ఓ వేదశాల ఏర్పాటుచేసేందుకు త‌న‌కు విశాఖ‌లో ఎక్క‌డైనా 15 ఎక‌రాల స్థ‌లం కావాల‌ని అడిగార‌ట‌.

ఇందుకోసం అప్ప‌ట్లో భీమిలిలోని కొత్త‌వ‌ల‌స స‌మీపంలో 15 ఎక‌రాల‌ను అత్యంత త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ శార‌దా పీఠానికి కేటాయించార‌ట‌. అప్ప‌ట్లో ఆ భూమి ఒక్కో ఎక‌రా విలువ రూ.15 కోట్లు. కానీ జ‌గ‌న్ రూ.1 ల‌క్ష‌కే ధ‌ర ఫిక్స్ చేసి రూ.15 ల‌క్ష‌లకు 15 ఎక‌రాలు రాయించార‌ట‌. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.214 కోట్లు. దీనిపై చంద్ర‌బాబు విచార‌ణ చేయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ పేరు చెప్పుకుంటూ స్వ‌రూపానందేంద్ర కోట్లు సంపాదించాడ‌ని.. బ‌య‌టికి మాత్రం స్వామీజీలా బిల్డప్ ఇస్తుంటాడు అనే టాక్ ఈయ‌న‌పై ఉంది.

ఇలా అత్యంత త‌క్కువ ధ‌ర‌కే భూములు కేటాయించ‌డంపై అప్ప‌ట్లో తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేసాయి. అదే స‌మ‌యంలో స్వ‌రూపానందేంద్ర స్వామి వేద పాఠ‌శాల కోసం కేటాయించిన భూముల‌ను క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లు, ఇళ్లు నిర్మించేలా చేస్తే మంచి లాభం ఉంటుంద‌ని ప్ర‌భుత్వానికి లేఖ రాసిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఈ భూముల‌పై చేప‌ట్టే విచార‌ణ‌లో లోపాలు ఉన్న‌ట్లు తేలితే ఆ భూముల‌ను మ‌ళ్లీ వెన‌క్కి తీసుకునే అవ‌కాశం ఉంది.