Chandrababu Naidu: సతీమ‌ణికి థ్యాంక్స్ చెప్పిన చంద్ర‌బాబు

chandrababu naidu thanked his wife via twitter

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రికి ట్విట‌ర్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు వ‌ర‌ద‌ల వ‌ల్ల విల‌విల‌లాడుతున్న నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల‌కు భువ‌నేశ్వ‌రి హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ ట్ర‌స్టీ హోదా రూ.2 కోట్లు దానం చేసారు. ఈ నేప‌థ్యంలో భువ‌నేశ్వ‌రికి ధ‌న్య‌వాదాలు చెప్తూ చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.