Chandrababu Naidu: ప్ర‌మాణ స్వీకారం అమ‌రావ‌తిలో కాద‌ట‌..!

chandrababu naidu swearing ceremony to happen in tadepalligudem

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా 11న ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. అయితే అంద‌రూ ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప్ర‌మాణ స్వీకారం చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన తాడేప‌ల్లిగూడెంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కార్యక్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. అందుకోసం అమ‌రావ‌తిలో కాకుండా తాడేప‌ల్లిగూడెంలో అయితే బాగుంటుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. తాడేప‌ల్లిలోని బ్రహ్మానంద‌పురంలో ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ట‌.