వేట మొద‌లు.. CID చీఫ్ సంజ‌య్‌కి సెల‌వు ఎవ‌రిమ్మ‌న్నారు?

Chandrababu Naidu slams cs jawahar reddy for accepting cid sanjay's leave

Chandrababu Naidu:  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్పుడు ఆయ‌న్ను గ‌త సంవ‌త్స‌రంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్లే న‌డుచుకున్నారు సీఐడి చీఫ్ సంజ‌య్. ఇప్పుడు ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే.. సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి సంజయ్‌ను సెల‌వుల‌పై పంపించారు. దాంతో సంజ‌య్ నిన్న రాత్రి అమెరికాకు జంప్ అయిపోయారు.

ఈ విష‌యం చంద్ర‌బాబు నాయుడుకి తెలీడంతో ఆయ‌న జ‌వ‌హ‌ర్ రెడ్డిపై మండిప‌డ్డారు. జ‌వ‌హ‌ర్ రెడ్డితో చంద్ర‌బాబు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఓటింగ్ జ‌రుగుతున్న‌ సంజ‌య్‌కు ఎందుకు సెల‌వుపై పంపించార‌ని నిల‌దీసారు. ఇప్ప‌టినుంచి అన్నింటిపై త‌న ఫోక‌స్ ఉంటుంద‌ని.. సొంత నిర్ణ‌యాలు తీసుకుంటే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.