Chandrababu Naidu: నువ్వు BROలో యాక్ట్ చేసే బ్రోక‌ర్‌వా?

AP: TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు.. (chandrababu naidu) ఏపీ మంత్రి అంబ‌టి  (ambati rambabu) రాంబాబుపై మండిప‌డ్డారు. నువ్వు మంత్రివా.. లేక బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోక‌ర్‌వా అంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మంత్రి స్థానంలో ఉండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) సినిమాకు ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని అంబ‌టి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్ప‌డంపై చంద్ర‌బాబు స్పందించారు. సైకో జ‌గ‌న్ ఇంకొంత మంది సైకోల‌ను రెడీ చేసి ప్ర‌జ‌ల‌పైకి వ‌దిలాడ‌ని, త‌న‌ను కూడా ఎన్నో మాట‌లు అన్నాడు కానీ తాను వీటికి భ‌య‌ప‌డ‌న‌ని అన్నారు. రాయ‌ల‌సీమ‌లోని ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ ఇలాఖాలోనూ TDPనే గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. (ap elections)