Chandrababu Naidu: కూటమిలో ఉన్నందుకు గర్వంగా ఉంది
Chandrababu Naidu: కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపినందుకు గర్వంగా ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హర్యాణాలో మూడోసారీ భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
“” నాది 40 ఏళ్ల రాజకీయ జీవితం. ఇన్నేళ్లలో ఎందరో ప్రధాన మంత్రులను చూసాను. కానీ నరేంద్ర మోదీ లాంటి ప్రధానిని మాత్రం చూడలేదు. ఆయనకు ఎప్పటికీ ఒకే ఆలోచన. ఎలా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తుంటారు. అందుకే హర్యాణా వారు ముచ్చటగా మూడోసారి అధికారం కట్టబెట్టారు. మంచి చేస్తున్నారు కాబట్టే మళ్లీ మోదీని గెలిపించారు. అలాంటి ప్రధాని ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. ఒకప్పుడు పత్రికలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఆ తర్వాత ఎవరికి వారు యజమానులుగా మారి ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు“” అని మండిపడ్డారు.