Chandrababu: భద్రతపై అనుమానాలు.. లేఖ రాసివ్వాలని కోరిన జడ్జ్
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో (skill development scam) చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) నవంబర్ 1 వరకు AP ACB కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడగించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ఏపీ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్నందున చంద్రబాబు మరికొంతకాలం రిమాండ్‌లో ఉండాలని AP ACB కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి న్యాయమూర్తి ఆరా తీసారు. ఎప్పటికప్పుడు హెల్త్‌కి సంబంధించిన నివేదికలు సమర్పిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. అనంతరం మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని జడ్జ్ చంద్రబాబుని వర్చువల్ వీడియో ద్వారా అడగ్గా.. జైల్లో భద్రతపై అనుమానంగా ఉందని తెలిపారు. ఈ మేరకు జడ్జ్ భద్రతకు సంబంధించిన సమస్యలను లిఖితపూర్వకంగా రాసి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసారు.